Life must blossom like a flower
Offering itself to the Divine

-The Mother

Tuesday, August 3, 2010

జీవన సాఫల్యం

సామాన్యంగా ఒక వయసు తరువాత జీవితం వృధా అని అనేకమంది భావిస్తారు. ముఖ్యంగా వయసు మీదపడ్డాక . కాని వ్రుదుల సాహచర్యం కూడా కొన్ని ప్రయోజనాలని ఇవ్వగలదు. అది కేవలం ఆ పెద్దల అలవాట్లు, వారి జీవిత పద్ధతుల మీద ఆధారపడి వుంది. మా నాయనమ్మ తన జీవసత్వాలు ఉడిగిపోయక కూడా యింట్లో అందరికి ఒక ఆసక్తిని కలిగించే వ్యక్తిగా మిగిలింది. కారణం ఆవిడ ఎవరి జోలికీ ఊరికే పోకుండా , తన దగ్గరికి వచ్చి ఆసక్తిని చూపే వారికి తన అనుభవాలతో నేర్చుకున్న కొన్ని చిట్కాలు , మందులు చెప్పేది. పోపుల డబ్బాలో ఎన్ని విలువగల పదార్ధలున్నాయో నాకు మా నాయనమ్మ వలననే తెలిసింది. మా అక్కయ్యకు మొదటి సంతానం కలిగినపుడు మా అమ్మమ్మ కొత్త గుడ్డలతో చిలకలు చేయడం నేర్పింది. యిప్పుడు అలాటి చిలకలు రాజస్తనీవాళ్ళు చేస్తారని తెలిసింది.

దురదృష్తవసాత్తు ఈ టీవీలు అటు పిల్లలనే కాక పెద్దవారిని కూడా తప్పుతోవ నడిపిస్తున్నాయి అనటం అతిశయోక్తి కాదు. మేం ఎవరికి కావలి అంటూ, కాలషేపం అంటూ చాలామంది పెద్దవాళ్ళు, కుయుక్తులతో కూడిన టీవీ సీరియల్స్ చూస్తూ, అటు వారి మనసులు పాడుచేసుకోవటమే కాకుండా , రకరకాల భయన్దోలనలకుగురియై వాతావరణం కలుషితం కావటానికి దోహదపడుతున్నారు.

పుట్టిన దగ్గరినుండి మనిషి కొంతకాలం తమకు తెలియకుండానే భౌతికంగా, మానసికంగా, మేధాపరంగా, ఆత్మపరంగా పెరుగుతుంటాడు. కాని ఒక వయసు వచ్చాక ఆ పెరుగుదల మనకు అనుభవం కావాలి. ముఖ్యంగా వయసు మల్లుతున్నకొద్ది మనసును అంతర్ముఖం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, మనిషి ఆద్యాత్మిక ఉన్నతికి పాటుపడాలి. అలా ప్రయత్నం చేసే మనుషుల సాహచర్యం చాల ప్రసాన్న్తంగా, తమ చుట్టూ చక్కని తరంగాలను వెదజల్లుతూ , చుట్టూ ఉన్నవారిలోగూడా ఒక ఉత్తేజాన్ని, ప్రగతిని పెంచుతాయి. అటువంటివారు తమతో ఎవరూ మాట్లాడరని , తాము ఎందుకూ పనికిరానివారని , నిరాశా, నిస్పృహలకు లోనుకారు. ముఖ్యంగా వారు వారి ఉనికి వల్లనే ఎంతో గౌరవాన్ని పొందుతారు. నాకు తెలిసిన ఒక తాతగారు తన కొడుకులు, కోడళ్ళు, మనమలు ఎక్కడో దూరదేసంలో ఉన్నారని నిరాస చెందకుండా తన జీవితంలో తాను పొందిన అనుభవాలన్నీ కొన్ని గేయాలుగా రూపొందించి, 'తాతయ్య తాళాలు' అనే ఒక పుస్తకంగా అచ్చు వేయించారు. అది ఆయన తన వారసులకే కాక సమాజంలో అందరికీ పంచిపెట్టిన ఆస్తిగా భావించవచ్చు.

ఈనాటి సామాజిక పరిస్థితులు పది ఏళ్ళ వయసు బాలబాలికలనుండీ నడివయసు వచేచేదాకా తరగని పరుగుల ప్రయాణంగా మారింది. ఒకనాడు ఆగామా మనముందు పదిమంది వెళ్ళిపోతారు. జీవితాన్ని ఈ రకమైన పరుగుపందెంగా భావించక తప్పదు ఈనాటి యువతరానికి. అందుచేత యింట్లో ఉండే పెద్దవారు వీరిపట్ల అవగాహన, సానుభూతి పెంచుకొని తమను ఎవరు పలకరిన్చత్లెదని టీవీ కాలషేపాలతో జీవితాన్ని వ్రుదాచేసుకోకుండా, చక్కని ఆధ్యాత్మిక చింతనను పెంచే పుస్తకాలను చదవడమో , క్యాసెట్లు వినడమో , తమ అనుభవాలను కాగితం మీద పెట్టె ప్రయత్నం చేయడమో , తమ వద్దకు ఆకర్షితులైన పిల్లలకు చక్కని నీతికధలో, చిట్కా మందులో, చేతిపనులో వారి వారి అభిరుచికి అనుగుణంగా చెప్పడమో చేస్తే , ఈనాటి యువతలో ఉన్న అశాంతి తప్పక తగ్గుతుంది. ఇల్లే తొలి పాటశాల. అటువంటి యింట్లో యిటువంటి ఆధ్యాత్మిక చిన్తనగల పెద్దలవల్ల యింట్లోని అందరికీ మనసులు కుదుటపడి, మనసుని ప్రభావితం చేస్తాయి. అది వారు పెద్దయ్యాక కూడా చక్కని బాటను చూపిన్చగాలుగుతాయి. మేము మీ యంత్రికజీవితం గడపలేమంటూనో , మాకు ఆప్యాయత కావాలి అంటూనో దూరంగా పోకుండా పిల్లలతోనే ఉంటూ పరోక్షంగా వారిలో ఆధ్యాత్మిక ప్రగతికి వారి జీవితమే ప్రమాణంగా పెంపొందించే ప్రయత్నం చెయ్యాలి. యిదీ ప్రతిఒక్క తాతయ్య తన కొడుకుకో , మనవడికో యివ్వగలిగే నిజమైన ఆస్తి.