Life must blossom like a flower
Offering itself to the Divine
-The Mother
Offering itself to the Divine
-The Mother
Tuesday, September 7, 2010
నో ఫాక్ట్స్ ప్లీజ్ ....
నిన్న సాయంత్రం భారత్ పార్క్ కి వెళ్లాం. coimbatore వచ్చాక యిదే మొదటిసారి ఈ పార్కుకి రావడం.పొడుగాటి పెద్దపెద్ద చెట్లు , నడిచేందుకు దారి , అంతా planned గా ఉంది. పక్షులన్నీ రోదరోదగా అరుస్తున్నాయి. నేను , మావారు నిశ్సబ్దంగా నడుస్తున్నాము. యింతలో ఆ పక్షుల అరుపులు ఏమై ఉంటాయని ఆలోచన వచ్చింది. మా వారితో అన్నాను. యేమని అనుకుంటూ ఉంటాయి? మనలాగే ఇంటికి వెళ్ళంగానే ఒకరికి ఒకరు ఈ రోజు ఎలా జరిగింది? ఎందుకలా ఉన్నావు? ఏమైనా అయిందా? లేకపోతే ఇంట్లో పిల్లలు పెద్దలు ఉంటె వాళ్ళకి హలో చెప్పడం లాంటివి, ఏదైనా పిల్ల పక్షి ఇంటికి తిరిగి రాలేదని కలవరపడుతున్నాయా... ఇలా చాలా చాలా ఉహించాము. ఇంతలో మా వారు "ఇంతకీ ప్రతి పక్షికి గూడు ఉంటుంది అంటావా చెట్టుమీద"? అన్నారు. ఏమో ఎవరికి తెలుసు? google ని అడుగుదామా? ఎవరో scientist కనుక్కునే ఉంటాడు పక్షుల భాష గురుంచి వాటి గూటి గురించి. కానీ నాకు తెలుసుకోవాలని లేదు. ఇలా ఊహించుకోవడమే బాగుంది. ఇలా ఊహించుకోవడం ప్రతి జీవి లోని ఏకాత్మ భావాన్ని గుర్తిన్చడమేకడా!
ఏమైనా ఇది నా students కి creative writing topic క్రింద ఇస్తే....
Intrepret birds sounds at dusk in your own words - will it not be fun ?!
Subscribe to:
Posts (Atom)